గుడ్ న్యూస్ చెప్పేసిన సానియా

SANIAటెన్నిస్ స్టార్ సానియా మీర్జా, ఆమె భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ సోమవారం (ఏప్రిల్-23) తమ అభిమానులకు ఓ సర్‌ ప్రైజ్ ఇచ్చారు. ఇద్దరూ తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో ఒకే రకమైన ఫొటో పోస్ట్ చేశారు. ఇటు మీర్జా, అటు మాలిక్, మధ్యలో మీర్జా మాలిక్ అంటూ ఓ కప్‌బోర్డ్ ఫొటో పోస్ట్ చేసి పరోక్షంగా తాను తల్లి కాబోతున్నాను అన్న మెసేజ్ ను అభిమానులకు ఇచ్చింది సానియా.

బేబీ మీర్జామాలిక్ అంటూ సానియా క్యాప్షన్ ఇవ్వడంతో ఆమె స్నేహితులు, బంధువులు కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు. ఈ మధ్యే తనకు పుట్టబోయే పిల్లల ఇంటి పేరు మీర్జామాలిక్‌ గానే ఉండాలని తాము నిర్ణయించుకున్నట్లు సానియా చెప్పిన విషయం తెలిసిందే. తమకు కూతురే కావాలని కూడా ఈ జంట కోరుకుంది. అప్పుడే ఆమె తల్లి కాబోతున్నదా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు ఇద్దరూ ఒకే రకమైన ఫొటోతో పరోక్షంగా ఆ వార్తలను ధృవీకరించినట్లు అయింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy