గుడ్ న్యూస్ : పోస్టుమ్యాన్ ల జీతాలను మూడురెట్లు పెంచిన కేంద్రం

posవేతనాలు పెంచాలంటూ కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్న పోస్టుమ్యాన్(గ్రామీణ డాక్ సేవక్) లకు కేంద్రం తీపి కబురు చెప్పింది. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న 2.6 లక్షల మంది పోస్టుమ్యాన్ ల బేసిక్ శాలరీని మూడు రెట్టు పెంచుతూ బుధవారం(జూన్-6) కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం నెలకు రూ. 2,295 ల బేసిక్ శాలరీ తీసుకుంటున్న గ్రామీణ డాక్ సేవక్ (GDS) లు ఇకపై 10 వేలు వేతనాన్ని అందుకుంటారు. రూ.2,745 ల బేసిక్ శాలరీ తీసుకుంటున్న వారు ఇకపై 12వేలు అందుకుంటారు. రూ.4,115ల బేసిక్ శాలరీ తీసుకుంటున్నవారు ఇకపై 14 వేల 500 రూపాయల శాలరీని అందుకుంటారని కేంద్రమంత్రి మనోజ్ సిన్హా బుధవారం తెలిపారు. ప్రతి ఏటా 3శాతం పెంచేందుకు కూడా కేంద్రం నిర్ణయించినట్లు తెలిపారు. కొత్తగా రిస్క్, హార్డ్‌ షిప్‌ అలవెన్సు నెలకు రూ.500 లను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. దీంతోపాటుగా ఆఫీసు నిర్వహణ అలవెన్సు, ఉమ్మడి విధుల అలవెన్సు, క్యాష్‌ కన్వేయెన్స్‌ చార్జీలు, సైకిల్‌ మెయింటెనెన్స్‌ అలవెన్సు (గతంలో రూ.50–ప్రస్తుతం రూ.115), ఫిక్స్‌డ్‌ స్టేషనరీ చార్జీలను కూడా పెంచినట్లు ఆయన తెలిపారు. 2016 జనవరి 1 నుంచి ఈ పెంపు అమల్లోకి వస్తుందన్నారు. ఉద్యోగులందరూ తిరిగి తమ విధులకు హాజరవ్వాలని ఆయన తెలిపారు. దేశ పోస్టల్‌ శాఖ ముఖచిత్రం మారుతుందని, త్వరలోనే ఇండియా పోస్ట్‌ పేమెంట్‌ బ్యాంకులు కూడా ప్రారంభం కానున్నాయని సిన్హా తెలిపారు. పోస్టల్‌ శాఖ ఆధ్వర్యంలో త్వరలో ప్రత్యేక ఇన్సూరెన్స్‌ కంపెనీ కూడా రాబోతున్నట్లు ఆయన తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy