గుడ్ న్యూస్: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

TELANGANAప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం(DA) పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. బుధవారం (మే-16) ఉద్యోగ సంఘాల జేఏసీ ఇచ్చిన 18 డిమాండ్లపై సీఎం సానుకూలంగా స్పందించారు. ఈ క్రమంలోనే  సమావేశంలో నిర్ణయానికి అనుగుణంగా1.5 శాతం  డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన DA జులై 1, 2017 నుంచి వర్తిస్తుంది.డీఏ పెంపుతో ప్రభుత్వ ఖజానాపై రూ. 350 కోట్ల భారం పడనుంది. పింఛన్‌ దారులకు కూడా ఈ డీఏ వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. సర్కారు నిర్ణయంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy