గురుకులం విద్యార్థినికి అమెరికాలో చదివే అవకాశం 

గిరిజన విద్యార్థినికి రాష్ట్ర ప్రభుత్వం అరుదైన అవకాశాన్ని కల్పించింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలోని సుదిమళ్ల గురుకులానికి చెందిన భూక్య లావణ్యకు అమెరికాలో రెండేళ్లపాటు చదివే అవకాశం వచ్చింది. ప్రతి ఏటా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన గురుకుల స్కూళ్లలో 10వ తరుగతి చదువుతున్న విద్యార్థుల నుంచి చదువులో అత్యంత ప్రతిభ చూపుతున్న ముగ్గురిని ఎంపిక చేసి అమెరికాలో చదువుకునే అవకాశం రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తోంది.

ఎంపిక చేసిన ముగ్గురు విద్యార్థుల్లో ఇద్దరు వనపర్తి జిల్లా కేంద్రం, రంగారెడ్డి జిల్లా బాలానగర్‌కు చెందిన విద్యార్థులు ఉండగా మరొకరు మండలంలోని సుదిమళ్ల గిరిజన గురుకులంలో పదో తరగతి చదువుతున్న భూక్య లావణకు అవకాశం దక్కింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం కొత్తూరు తండా గ్రామానికి చెందిన భూక్య ఉపేందర్, నీలావతి దంపతులకు ఇద్దరు సంతానం. అందులో పెద్దకుమార్తె అయిన లావణ్య సుదిమళ్ల గిరిజన గురుకుల స్కూల్లో చదువుతోంది. నవంబర్ నెలలో లావణ్య అమెరికా వెళ్లే అవకాశం ఉందని… దీనికోసం అవసరమైన వీసా, పాస్‌పోర్టు వ్యవహారాలన్ని గిరిజన సంక్షేమశాఖ చూసుకుంటుందని సుదిమళ్ల గిరిజన గురుకుల పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మిని తెలిపారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy