గురుకులకు ప్రవేశాలు..ఆన్ లైన్లో దరఖాస్తులు

gurululaas2018-19 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రంలోని 204 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించనుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను తెలంగాణ మైనార్టీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ  సోమవారం(మార్చి-19) జారీచేసింది. 5వ తరగతిలో అన్ని సీట్లను, 6,7,8,9 తరగతుల్లో బ్యాక్‌లాగ్ సీట్లను భర్తీ చేయనున్నట్లు మైనారిటీ గురుకులాల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి బి.షఫీయుల్లా తెలిపారు. కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలు గల విద్యార్థులు గురుకులాల్లో ప్రవేశాలకు అర్హులన్నారు.

ఆసక్తి ఉన్న విద్యార్థులు ఏప్రిల్ 20 లోగా ఆన్‌లైన్ ద్వారా tmreis.telangana.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఫొటో, ఆధార్‌తో ఏప్రిల్‌ 20 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

75 శాతం సీట్లను మైనార్టీ విద్యార్థులతో, 25 శాతం సీట్లను మైనార్టీయేతర విద్యార్థులతో భర్తీ చేస్తారు. సీట్ల కంటే దరఖాస్తులు అధికంగా వస్తే ఏప్రిల్‌ 28న లక్కీ డ్రా ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. సర్టిఫికెట్ల పరిశీలన ఏప్రిల్ 30 నుంచి మే 5 వరకు ఉంటుంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

ఆన్‌లైన్ దరఖాస్తులకు సంబంధించి సూచనలు, సలహాల కోసం, రిజిస్ట్రేషన్ చేయడానికి హైదరాబాద్ నాంపల్లి హజ్‌హౌస్‌లో ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇతర వివరాలకు హెల్ప్‌లైన్ నంబర్ 040-23437909కు ఫోన్ చేయవచ్చు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy