గురువాయూర్ గుడికి బాంబు బెదిరింపు

guruvayurప్రశాంతంగా ఉన్న ఆలయం..సందర్శకులతో నిండిపోయింది..పూజలు యథావిథిగా సాగుతున్నాయి.. ఇంతలో ఓ ఫోన్ కాల్ ఆలయ కమిటీకి చమటలు పట్టించింది. కేరళలో ప్రఖ్యాతగాంచిన గురువాయూర్ శ్రీ కృష్ణ దేవాలయానికి గుర్తుతెలియని వ్యక్తి కాల్ చేసి బాంబు పెట్టినట్లు బెదిరించాడు. ఈ సంఘటన శనివారం ఉదయం చోటుచేసుకుంది. ఒక్కసారిగా భయపడ్డ దేవాలయ కమిటీ పోలీసులకు సమాచారం ఇచ్చింది. క్షణాల్లో బాంబ్ స్క్వాడ్ తో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆలయం మొత్తం తనఖీలు చేపట్టారు. సెక్యూరిటీని అలర్ట్ చేసి ఎంత వెతికినా ఏమి లేకపోవడంతో ఊపిరి పీల్చుకుంది ఆలయ కమిటీ. దేవాలయంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నందుకే బాంబ్ పెట్టినట్లు ఆ ఆగంతకుడు కాల్ లో చెప్పడం పై పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy