గూగుల్‌ గౌరవం: భారతీయ శాస్త్రవేత్త డూడుల్

googleనోబెల్‌ బహుమతి పొందిన భారతదేశ ఖగోళ భౌతికశాస్త్రవేత్త సుబ్రహ్మణ్యన్‌ చంద్రశేఖర్‌ 107 జయంతిని పురస్కరించుకుని గూగుల్‌ డూడుల్‌ పెట్టింది. నక్షత్రాల పరిణామ సిద్ధాంతాన్ని ( theory of evolution of stars) కనుగొన్నందుకుగాను ఆయన నోబెల్‌ బహుమతిని అందుకున్నారు. ఇండో-అమెరికన్‌ ఖగోళ భౌతికశాస్త్రవేత్త నక్షత్రాల్లోనూ పరిణామదశ ఉందన్న అంశాన్ని కనుగొన్నారు.పాకిస్తాన్ లాహోర్‌లో 1910 అక్టోబర్‌ 19న ఓ తమిళ కుటుంబంలో జన్మించారు. ప్రముఖ భౌతిక శాస్తవేత్త సీవీ రామన్‌కు సుబ్రహ్మణ్యన్‌ మేనల్లుడు.

మద్రాస్‌ ప్రెసిడెన్సీ కాలేజీలో, అమెరికా వెళ్లే వరకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ(1936)లో చదివారు. తర్వాత చికాగో యూనివర్శిటీలో అధ్యాపకుడిగా పనిచేశారు. నక్షత్రాల పరిణామ సిద్ధాంతాన్ని కనుగొన్నందుకు గాను 1983లో ఆయన్ను నోబెల్‌ బహుమతికి ఎంపిక చేశారు. కేంబ్రిడ్జి యూనివర్సిటీలో రిసెర్చగా వ్యవహరిస్తున్న కాలంలో ‘చంద్రశేఖర్‌ లిమిట్‌’గా పిలిచే తన సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. నక్షత్రాలు అస్థిరత్వం కావని, వాటికవే నష్టపోయి తెల్లని మరుగుజ్జులుగా మారుతాయని తన పరిశోధనల్లో తెలిపారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy