గూగుల్ ఆప్షన్ : భారతీయ భాషల్లో వాయిస్ సెర్చ్

originalసెర్చ్ ఇంజిన్ గూగుల్ నెటిజన్లకు మరో బంపర్ ఆఫర్ ఇస్తోంది. గూగుల్ వాయిస్ సెర్చ్‌ను ఇకపై ప్రాంతీయ భాషల్లో ఇవ్వనుంది. ఈ సేవను 30 ప్రాంతీయ భాషల్లో అభివృద్ధి చేయడంతో, వాయిస్ ఆర్డర్ ద్వారా గూగుల్‌ను ఆపరేట్ చేయడం మరింత సులభతరం అవుతుంది. ఈ భాషలు ఆండ్రాయిడ్ ఫోన్లలోని గూగుల్‌ యాప్‌తో పాటు జీబోర్డు యాప్‌ల్లోనూ పనిచేస్తాయి.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వంటి దక్షిణాది భాషలతో పాటు బెంగాలీ, గుజరాతీ. మరాఠీ, ఉర్దూ వంటి ఉత్తరాది భాషల్లోనూ ఈ వాయిస్ సెర్చ్ అందుబాటులో వుంటుంది. ప్రస్తుతానికి ఇంగ్లీష్, హిందీ భాషలకే పరిమితమైన గూగుల్ వాయిస్ సెర్చ్ సేవలను మరో 30 భాషల్లో అందించేందుకు సిద్ధమవుతోంది గూగుల్. ఈ సేవ‌ను ఉప‌యోగించుకోవాలంటే సెట్టింగ్స్‌లో వాయిస్ మెనూలో త‌మ ప్రాంతీయ భాష‌కు ఆప్ష‌న్ మార్చుకోవాలి. ఈ సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వారికి సౌకర్యంగా వుంటుందని.. తద్వారా స్మార్ట్ ఫోన్ల కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

 

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy