
గూగుల్ కు చెందిన 3వేలకు పైగా ఫ్రీ యాప్స్ నుంచి వినియోగదారుల వ్యక్తిగత వివరాలను ట్రాక్ అవుతున్నాయి అనేది ఈ రిపోర్ట్ సారాంశం. పిల్లల వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తోందని చెబుతున్నారు. అమెరికా ఫెడరల్ చట్టంలోని పిల్లల ఆన్ లైన్ గోప్యతా రక్షణ చట్టం, చిల్డ్రన్స్ ఆన్ లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ (COPPA)కు అనుగుణంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకునేందుకు నిర్వహించిన ఒక ఇండిపెండెంట్ సర్వే ఈ షాకింగ్ అంశాలను వెల్లడించింది.
ఆటోమేటెడ్ సిస్టమ్ ద్వారా ఈ పరిశోధన నిర్వహించినట్టు పరిశోధకులు వెల్లడించారు. ఇంటర్నేషనల్ కంప్యూటర్ సైన్స్ ఇన్స్టిట్యూట్ రీసెర్చ్( ICSI ) నివేదించిన సమాచారం ప్రకారం.. పరిశోధనలో భాగంగా గూగుల్ ప్లేలోని మొత్తం 5 వేల 855 ఆండ్రాయిడ్ యాప్స్ ను పరిశీలించింది. వీటిలో సగానికి (3వేల337) పైగా ఫ్యామిలీ, పిల్లల యాప్స్ అమెరికా గోప్యతా చట్టాలను ఉల్లంఘించాయని తెలిపింది.
తల్లిదండ్రుల అనుమతి లేకుండా 256 యాప్స్.. 13 సంవత్సరాల లోపు పిల్లల లొకేషన్ డేటానూ సేకరించిందట. వీటిలో పేర్లు, ఇమెయిల్, ఇంటి అడ్రస్, ఫోన్ నంబర్లు లాంటివి ఉన్నాయని వెల్లడించింది ఈ సర్వే. దీనిపై స్పందించేందుకు గూగుల్ ప్రతినిధులు నిరాకరించారు. గూగుల్ కు చెందిన వీడియో ప్లాట్ ఫాం యూ ట్యూబ్ ఉద్దేశపూర్వకంగా పిల్లల డేటాను సేకరిస్తూ చిల్డ్రన్స్ ఆన్ లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్ (COPPA) నిబంధలను ఉల్లంఘింస్తోందంటూ 20కిపైగా కన్జ్యూమర్ ఎడ్వకసీ గ్రూప్స్ ఆరోపణల క్రమంలో ఈ అధ్యయనం చేసింది. ఇంత కీలకమైన పర్సనల్ వివరాలను సేకరించడం ఆందోళన కలిగించే అంశమని స్పష్టం చేసింది రిపోర్టు.
Over 3300 Android Apps Improperly Tracking Children: Study https://t.co/u2Xnjp22uO@FTC @Android @GooglePlay#AndroidApps #AppsForKids #ChildrenApps #GooglePlayStore #Tracking #DataBreach pic.twitter.com/evKxn5xfZm
— IT Magazine (@itmagazinepk) April 17, 2018