గూగుల్ మీకో జాబ్ చూపిస్తుంది

google_campus_hyderabadజాబ్ కోసం వెయిట్ చేస్తున్నారా? పీజీలు, పీహెడీలు, రకరకాల కోర్సులు చేసి… ఖాళీగా ఉన్నారా? అయితే ఇంకెందుకు లేటు… గూగుల్ మీకో ఉద్యోగం ఇచ్చేందుకు ప్లాన్ చేస్తోంది. ఆన్ లైన్ నానో డిగ్రీలతో దేశంలోని యూత్ కు జాబ్ ఆఫర్ చేస్తోంది. నిరుద్యోగ యువతకు  ప్లేస్ మెంట్ కల్పించేందుకు… ఆండ్రాయిడ్ నానో డిగ్రీలను స్టార్ట్ చేసింది గూగుల్ కంపెనీ. ఉద్యోగం కోసం ఏళ్ల తరబడి నానా కోర్సులు చేసే వారికి… జెస్ట్ 6 నుంచి 9 నెలల్లోనే ఉద్యోగం పొందే చాన్స్ ఇస్తోంది. ఆన్ లైన్ ఎడ్యుకేషన్ కంపెనీ యుడాసిటీ భాగస్వామ్యంతో భారత్ లోని యువతకు ఐటీ  కోర్స్ ఆఫర్ చేస్తోంది  గూగుల్.

ఇంటర్నేషనల్, నేషనల్ యాప్ ల తయారు చేసే మొబైల్ డెవలర్లను… తయారు చేయడమే లక్ష్యంగా ఆండ్రాయిడ్ నానో కోర్సులను అందిస్తున్నట్టు చెబుతున్నారు గూగుల్ వైస్ ప్రిసిడెంట్ రాజన్ ఆనంద్. యుడాసిటీ భాగస్వామ్యంతో ఆఫర్ చేస్తున్న ఈ కోర్సుకు నెలకు 9 వేల 800 రూపాయలి ఫీజుగా ఫిక్స్ చేసింది.  గూగుల్ 500 మందికి, టాటా ట్రస్టు 500 మందికి స్కాలర్ షిప్ లను స్పాన్సర్ చేస్తున్నాయి.

2018నాటికి దేశంలో ఉన్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు… అమెరికాను బీట్ చేస్తారని తెలిపారు గూగుల్ ప్రతినిధులు. టాప్ వెయ్యి ఆండ్రాయిడ్ యాప్ లలో భారత్ డెవలపర్లు రూపొందించిన యాప్స్ 2శాతమే అని చెప్పారు. దేశంలో సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్స్ ఎక్కువగానే ఉన్నా… యాప్ ల తయారీలో నైపుణ్యం ఉన్న ఎక్స్ పర్ట్స్ మాత్రం తక్కువగా ఉండటంతో నానో డిగ్రీలను ఆఫర్ చేస్తున్నట్టు చెబుతున్నారు.

నానో డిగ్రీని డెవలపర్లు ఎక్కడ నుంచైనా, ఏ డివైస్ తో నైనా కొన్ని నెలల్లోనే కోర్సు నేర్చుకుని ఈజీగా జాబ్ కొట్టేయోచ్చు మరి. ఇంకెందుకు లేటు ఇప్పుడే అప్లికేషన్ పెట్టేయండి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy