గూడకు సుద్దాల హన్మంతు జానకమ్మ పురస్కారం

Screen Shot 2015-10-14 at 9.18.06 AMసుద్దాల హన్మంతు జానకమ్మ జాతీయ పురస్కారాన్ని ప్రముఖ ప్రజాకవి గూడ అంజన్న అందుకున్నారు. సాహిత్య రంగంలో చేసిన సేవలకు గాను..సుద్దాల ఫౌండేషన్ ప్రతిఏటా ఈ అవార్డ్ ను అందిస్తోంది. సుందరయ్య విజ్ణాన భవన్ లో..అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపి బూర నర్సయ్య గౌడ్, ప్రభుత్వ వాస్తు సలహాదారు సుధాకర్ తేజ, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్,  సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ  ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సుద్దాల ఫౌండేషన్ వ్యవస్థాపకులు, సినీగేయరచయిత సుద్దాల అశోక్ తేజ.. అవార్డ్ ను గూడ అంజయ్యకు ప్రధానం చేశారు.అవార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. ఈ సందర్భంగా..పలువురు కవులు, గాయకులను సత్కరించారు అతిథులు.

Screen Shot 2015-10-14 at 9.17.24 AM

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy