గెయిల్ బాధితులకు భారీ పరిహారం…!

BABUFIREగెయిల్ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం భారీ పరిహారం ప్రకటించింది. ఈ రోజు తెల్లవారుజామున తూర్పుగోదావరి జిల్లాలోని మామిడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైప్ లైన్ కు ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ఆ సౌండ్ కు భయపడిన ప్రజలు పరుగులు తీశారు. ఉదయం నుంచే ఏపీ హోం మంత్రి, జిల్లా కలెక్టర్, అధికారులు సంఘటన స్ధలంలో సహాయక చర్యలను  పర్యవేక్షించారు. భారీగా ఎగసిన మంటలతో కొబ్బరి తోటలు, ఇళ్లు, షాపులు పూర్తిగా కాలిపోయాయి.

మంటల్లో చిక్కుకొని 15 మంది సజీవ దహనం అయ్యారు.  దాదాపు 50 మందికి తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకోని మధ్యాహ్నం 3 గంటలకు ఘటనా స్థలాన్ని సందర్శించారు. ఆయన వెంట కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా వచ్చారు. ఘటన జరిగిన విధానంపై అధికారులతో చర్చించారు. దీనిపై ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

ఇక ఘటనలో చనిపోయిన వారికి రూ.25లక్షలు అందిస్తామని…వాటిలో గెయిల్ కంపెనీ నుంచి రూ.20లక్షలు…కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2లక్షలు..ఏపీ ప్రభుత్వం నుంచి రూ.3లక్షల పరిహారం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఇళ్లు కోల్పోయిన వారికి పక్కా ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన సేవలు ప్రభుత్వం నుంచి అందిస్తామని..గాయపడిన వారికి రూ.5లక్షలు అందిస్తామని చెప్పారు బాబు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy