గ్యాస్ పైప్ లైన్లో మంటలు…14 మంది సజీవదహనం

Mantalu3తూర్పుగోదావరి జిల్లాలో దారుణం జరిగింది. మామడికుదురు మండలం నగరం గ్రామంలో గెయిల్ పైప్ లైన్ పేలింది. దాదాపు 18 అడుగుల పైప్ లైన్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు చుట్టుముట్టడంతో గ్రామంలోని కొబ్బరి తోటలు, ఇళ్లు, షాపులు పూర్తిగా కాలిపోయాయి.  మంటల్లో దాదాపు 14 మంది సజీవదహనం అయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారికి అమలాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 5 ఫైరింజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు.

Mantalu2మంటల్లో కాలిపోయిన మృతదేహాలు గుర్తి పెట్టలేనంతగా తయారైయ్యాయి. గెయిల్ ఘటనను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రధాని మోడీ, పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్తారు. వెంటనే స్పందించిన మోడీ గెయిల్ ఛైర్మన్, పెట్రోలియం శాఖ మంత్రితో మాట్లాడారు. ఘటనలో చనిపోయిన వారికి రూ.2లక్షలు, గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని తన రిలీఫ్ ఫండ్ నుంచి ప్రకటించారు మోడీ.

గెయిల్ ఘటనతో ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు చేసుకొని ఘటనా స్థలికి రానున్నారు. జిల్లా కలెక్టర్, హోం మంత్రి చిన రాజప్ప, సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. గెయిల్ ఘటనపై ఉన్నత స్థాయి విచారణ కమిటీ వేశామన్నారు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy