గెలిచామోచ్… చివరి మ్యాచ్ లో బెంగళూరు విజయం

rcb-wonఎట్టకేలకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచింది. వరుసగా ఏడు ఓటములతో ఢీలాపడిన బెంగళూరు గెలుపుతో టోర్నీని ముగించింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ఆదివారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి (58), క్రిస్‌గేల్ (48) నిలకడగా ఆడటంతో తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఛేదనలో రిషబ్ పంత్ (45), శ్రేయాస్ అయ్యర్ (32) మెరిసినా.. మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమవడంతో ఢిల్లీ సరిగ్గా 20 ఓవర్లలో 151 పరుగులకు ఆలౌటైంది. సంజు శాంసన్ (0), కోరె అండర్సన్ (3), కమిన్స్ (7) కీలక సమయంలో వికెట్లు చేజార్చుకుని జట్టును ఒత్తిడిలో పడేశారు. చివర్లో మహ్మద్ షమీ (21) దూకుడుగా ఆడి.. బెంగళూరును కంగారు పెట్టినా పవన్ నేగి అతడ్ని బోల్తా కొట్టించడంతో ఢిల్లీ ఓటమి ఖాయమైంది. చివరి ఓవర్‌లో ఢిల్లీ విజయానికి 13 పరుగులు అవసరం కాగా.. రెండు పరుగులు మాత్రమే ఇచ్చిన నేగి రెండో బంతికి షమీని,. చివరి బంతికి నదీమ్‌ని ఔట్ చేసి బెంగళూరును గెలిపించాడు. ఈ ఓటమితో 12 పాయింట్లతో ఢిల్లీ ఆరో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి నిష్ర్కమించగా.. ఏడు పాయింట్లు మాత్రమే సాధించిన బెంగళూరు చివరి స్థానంలో సీజన్‌ని ముగించింది.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy