గెలుపెవరిది : కర్నాటక ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయ్

Karnataka-Assembly-Polling-2018కర్నాటక పోలింగ్ యుద్ధం ముగిసింది. గెలుపు ఎవరిది అనేది తెలియాలి అంటే 15వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే. ఓటరు తీర్పు ఎలా ఉంది అని తెలియటానికి మరో రెండు రోజుల సమయం ఉన్నా.. ఆయా సంస్థల సర్వేలు వచ్చేశాయి. ప్రధాని మోడీ – రాహుల్, సిద్ధరామయ్య – యడ్యూరప్ప మధ్య సాగిన ఓట్ల పోరును దేశం మొత్తం ఉత్కంఠగా చూసింది. బీజేపీ – కాంగ్రెస్ పార్టీలు కర్నాటక గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో ప్రధాని మోడీ 16 సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ అయితే రెండు నెలలు అక్కడే ప్రచారం నిర్వహించారు. కర్నాటక పోలింగ్ సరళిపై వివిధ టీవీ ఛానల్స్, సర్వే సంస్థలు ఇచ్చిన ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ ఇలా ఉన్నాయి. 224 అసెంబ్లీ సీట్లకు 222 స్థానాల్లో పోలింగ్ జరిగింది. అధికారం దక్కించుకోవాలంటే మ్యాజిక్ ఫిగర్ 112 స్థానాలు.

టౌమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ : కాంగ్రెస్ : 90-103, బీజేపీ : 80-93, జేడీఎస్ : 31-39, ఇతరులు : 2-4

ఇండియా టుడే సర్వే : కాంగ్రెస్ : 106-118, బీజేపీ : 79-92,  జేడీఎస్ : 22-30, ఇతరులు : 1-4

రిపబ్లిక్ టీవీ సర్వే : కాంగ్రెస్ : 73-82, బీజేపీ : 95-114, జేడీఎస్ : 32-43

న్యూస్ ఎక్స్ : కాంగ్రెస్ : 72-78 , బీజేపీ : 102-110, జేడీఎస్ : 35-39, ఇతరులు : 3-5

సువర్ణ న్యూస్ : కాంగ్రెస్ : 73-82, బీజేపీ : 95-114, జేడీఎస్ : 32-43, ఇతరులు : 2-3

NDTV సర్వే : కాంగ్రెస్ : 89, బీజేపీ : 97, జేడీఎస్ : 33

ABP న్యూస్ ఎగ్జిట్ పోల్ : కాంగ్రెస్ : 93, బీజేపీ : 103, జేడీఎస్ 25, ఇతరులు : 0-4

సీ-ఓటర్ సర్వే : కాంగ్రెస్ : 93, బీజేపీ : 103, జేడీఎస్ : 25, ఇతరులు : 1

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy