గెలుపే టార్గెట్ : ఓటర్లను ఆకర్షించడానికి కర్ణాటకలో పార్టీల ప్రలోభాలు

cookerఎన్నికల సమరం దగ్గరపడటంతో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు కర్ణాటకలోని పార్టీలు తమ ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే ఎన్నికల డేట్లను(మే 12,15) కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ సమయంలో శనివారం(మార్చి31) ఓటర్లకు పంచేందుకు తీసుకెళ్తున్న ప్రెషర్ కుక్కర్‌ లతో నిండి ఉన్న ఓ మినీ లారీని అధికారులు స్వాధీ నం చేసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్న10 లక్షల రూపాయల విలువగల 2వేల నకిలీ నోట్లను డైరక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎటువంటి పత్రాలు లేకుండా ఇల్కాల్ నుంచి బాగల్‌కోట్‌కు 54 లక్షలను కారులో తరలిస్తుండగా పోలీసులు సీజ్ చేశారు.

ఓటర్లకు పంచేందుకు ప్రెషర్ కుక్కర్‌ లను తీసుకెళ్తున్న ఓ మినీ లారీ శనివారం(మార్చి31) బెలగావిలో పట్టుబడింది. కుక్కర్లపై కాంగ్రెస్ నేత లక్ష్మీ హెబ్బాల్కర్ పేరు ఉన్న స్టిక్కర్లు ఉండటంతో బీజేపీ నేతలు ఆ లారీని ఆపి ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఓ వ్యక్తి అందించిన సమాచారం ప్రకారం కుక్కర్లను తీసుకెళ్తున్న మినీ లారీని గుర్తించి దానిని నిలిపి అధికారులకు సమాచారం అందించడం జరిగిందని బీజేపీ నేత అనిల్ బెనకే తెలిపారు.  ప్రెషర్ కుక్కర్లను స్వాధీ నం చేసుకున్న అధికారులు ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘన కింద కేసు నమోదు చేశారు.

హౌరా నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలులో నకిలీ నోట్లను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో  అధికారులు విశాఖపట్నం దగ్గర తనిఖీలు చేయగా ఇద్దరు వ్యక్తుల దగ్గర ఉన్న 10 లక్షల విలువ గల నకిలీ 2 వేల నోట్లను డీఆర్‌ ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నకిలీ నోట్లను బంగ్లాదేశ్ నుంచి కర్ణాటకకు తరలిస్తున్నట్లు విచారణలో తేలిందని అధికారులు తెలిపారు. ఈ నకిలీ నోట్లను పాకిస్థాన్‌లో ముద్రించి ఉండవచ్చని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.
dpc

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy