‘గే’ చేతిలో యూఎస్ ఆర్మీ పగ్గాలు..?

150918180612-eric-fanning-army-exlarge-169యూఎస్ ఆర్మీకి కొత్త చీఫ్ రాబోతున్నాడు. ఇప్పుడీ వార్త వాల్డ్ వైడ్ గా చర్చనీయాంశమయ్యింది. ఈ న్యూస్… యూఎస్.. ఇంకా ఎక్కువగా మాట్లాడితే.. ఆ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితమవ్వాల్సిన అంశం. మరెందుకు అంతగా చర్చకొస్తోంది. విషయం ఏంటంటే.. యూఎస్ ఆర్మీ సెక్రటరీగా ఎరిక్ కె. ఫానింగ్ ను నామినేట్ చేస్తున్నట్టు ప్రకటించారు ప్రెసిడెంట్ ఒబామా. ఈ వార్త వినగానే అందరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఎందుకంటే.. ఎరిక్ ఆర్మీ సెక్రటరీగా ఎంపికైతే … ఆ పదవి అలంకరించిన తొలి స్వలింగ సంపర్కుడిగా చరిత్ర సృష్టిస్తాడు. ఎరిక్ పై మంచి ఒపీనియన్ తో ఉన్నారు ఒబామా. అపారమైన అనుభవంతో పాటు  సమర్థవంతమైన నాయకత్వలక్షణాలు ఎరిక్ సొంతమన్నారు ఒబామా?  ఇప్పటికే తనను తాను గే గా ప్రకటించుకున్నాడు ఎరిక్… ప్రస్తుతం యూఎస్ అండర్ సెక్రటరీ ఆఫ్ ఆర్మీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అయితే యూఎస్ సెనేట్ ఆమోదం తెలిపాల్సి ఉంది. సెనేట్ కూడా ఓకే చెప్పేస్తే… ఎరిక్ యూఎస్ ఆర్మీ పగ్గాలు చేపట్టడమే తరువాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy