గైక్వాడ్‌పై నిషేధం ఎత్తివేసిన ఎయిరిండియా 

gaikwadశివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటించింది. ఆయనపై నిషేధం ఎత్తివేయాలంటూ పౌరవిమానయానశాఖ లేఖ రాయడంతో ఎయిరిండియా ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి 23న ఎయిరిండియా మేనేజర్‌ను రవీంద్ర గైక్వాడ్‌ చెప్పుతో  దాడి చేసిన తర్వాత విమాన ప్రయాణాలపై ఎయిరిండియా నిషేధం విధించింది. దీంతో ఆయన విమానాల్లో ప్రయాణించకుండా ఎయిరిండియాతో పాటు దాదాపు అన్ని విమానయాన సంస్థలూ నిషేధం విధించాయి. ఈ వ్యవహారం పార్లమెంటును కుదిపేసింది. దీనిపై విచారం వ్యక్తం చేసిన గైక్వాడ్  ప్రయాణాలపై నిషేధాన్ని ఉపసంహరించుకోవాలంటూ కేంద్ర విమానయానశాఖ మంత్రి అశోక్‌గజపతి రాజుకు లేఖరాయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయం వెంటనే అమల్లోకి వచ్చింది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy