గొప్ప పథకాలను ప్రవేశపెట్టిన మహా మనీషి కేసీఆర్ : రసమయి

RASAMAIఎవరికీ ఆలోచన రానటువంటి పథకాలను ప్రవేశపెట్టిన మహా మనీషి సీఎం కేసీఆర్ అన్నారు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. శుక్రవారం (ఏప్రిల్-27) TRS 17వ ప్లీనరీ సందర్భంగా కొంపల్లిలో జరిగిన సభలో ప్రసంగించారు రసమయి. ఈ సందర్భంగా రసమయి మాట్లాడుతూ.. నన్ను చేరదీసి నా కన్నతల్లి ముఖంలో చిరునవ్వులు చూడటానికి కేసీఆర్ కారణమయ్యారన్నారు.

తెలంగాణ ఉద్యమం సమయంలో తాను చేసిన పనికి గుర్తింపు దక్కిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప పథకాలతో రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా చేసిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు. వృద్ధులకు వెయ్యి రూపాయల పించన్లు అద్భుతమని తన నియోజకవర్గంలో నేను తలెత్తుకుని బతుకుతున్నానన్నారు. కన్న కొడుకులు కూడా చేయలేని పనులకు సీఎం కేసీఆర్ చేస్తున్నారని, అవ్వల కళ్లళ్ల ఆనందం చూస్తున్నామని తెలిపారు. కేసీఆర్ ప్రవేశపెట్టినవి పథకాలు కావని పేదోళ్ల జీవితాలు అన్నారు. సీఎం కేసీఆర్ పటాలకు పాలాభిషాకాలు..డబుల్ బెడ్ రూమ్స్ ప్రతి ఒంట్లో కేసీఆర్ ఫోటోలు పెట్టి పూజలు చేస్తున్నారని తెలిపారు. వితంతువులకు పించన్లు ఇచ్చి, ఒంటరి మహిళలు తలెత్తుకుని బతుకుతున్నారని..బోదకాల వ్యాధిగ్రస్తులకు వెయ్యి పించన్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్ ది అన్నారు.

ఎన్నికల మానిఫెస్టులో లేని  ఆడబిడ్డ కోసం కల్యాణలక్ష్మి పథకం పెట్టారు. గర్భావతులకు కేసీఆర్ కిట్ తో పోషకాహారం ఇస్తున్నారని, అమ్మఒడి అంబులెన్స్ తో తల్లీబిడ్డలను ఇల్లు చేరుస్తున్నారు. కన్నతల్లికి కూడా ఆలోచనరానటువంటి ఆలోచన సీఎం కేసీఆర్ కు వచ్చిందన్నారు. దళితులకు పైకి కాకుండా చూస్తున్నారని, దళితుల కోసం ఆలోచించి మూడు ఎకరాల భూమి ఇచ్చిన నాయకుడు సీఎం కేసీఆర్ అన్నారు. దళిత పిల్లల చదువు కోసం విదేశాలకు వెళ్లేవారికి 20 లక్షలు ఇస్తున్నామని తెలిపిన రసమయి..ప్రతి దళిత విద్యార్థి ఎదగడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రసమయి. ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని.. రేషన్ దుకాణాల ద్వారా 2 కోట్ల 74 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. దివ్యాంగులకు నెలకు రూ. 1500 పింఛను ఇస్తున్నామని గుర్తు చేశారు రసమయి బాలకిషన్.

 

Leave a Reply

Your email address will not be published.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy