గోపాలుడి పుట్టినరోజు.. లోకమంతా పండగరోజు

janmashtamiహిందువుల పండుగల్లో కృష్ణాష్టమికి ప్రత్యేకత ఉంది. లోక రక్షకుడు..  మహావిష్ణువు స్వరూపమైన శ్రీకృష్ణడు జన్మించిన రోజును కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. ఈ పర్వదినం రోజు ఆ దేవ దేవుని పూజిస్తే జన్మ సార్థకమవుతుందని భక్తుల నమ్మకం. దశావతారాల్లో కృష్ణావతారం విశిష్టమైనది.. కృష్ణుడి లీలలు.. మనిషి జీవితంలోని ప్రతి అణువును స్పృషిస్తూ…దిశానిర్దేశం చేస్తాయి.

దుష్టశిక్షణ, శిష్ట రక్షణ కోసం ప్రతి యుగంలోనూ జన్మిస్తానని దేవతలకు మహావిష్ణువు అభయమిస్తాడు. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుని అవతారంలో అష్టమి రోజున దేవకీ, వసుదేవులకు చెరసాలలో జన్మించాడు కన్నయ్య. మేనమామ కంసుడి అంతంతోనే కృష్ణుడి దుష్ట సంహారం మొదలవుతుంది. చిన్ని కృష్టుడిగా.. వెన్న దొంగగా.. గోపికల అల్లరి ప్రియుడిగా గోపాలుడి చేష్టలు ఒక్కోటి ఒక్కో లీల.

పాండవుల పక్షాన నిలిచి  కురుక్షేత్ర యుద్ధాన్ని నడిపిస్తాడు. దుష్టశిక్షణ గావించి ప్రపంచానికి గొప్ప మార్గదర్శకత్వాన్ని చాటుతాడు. కష్టాల్లో ఉన్నవారు ధైర్యంగా ఎలా ముందుకు సాగాలో గీతోపదేశంలో ప్రబోధిస్తాడు. శ్రీకృష్ణడి జీవితంలోని ప్రతి ఘట్టం మానవజీవితానికి మార్గ నిర్దేశనం చేస్తుంది. అందుకే భాగవతం హిందువుల పవిత్రగ్రంథమైంది.

కృష్ణాష్టమిని  జన్మాష్టమని, గోకులాష్టమి అని కూడా అంటారు. ఈ పండుగను కొంతమంది శ్రావణ బహుళ అష్టమినాడు చేసుకుంటారు. ఇంకొంతమంది కృష్ణుడు పుట్టినప్పటి రోహిణీ నక్షత్రం రోజున జరుపుకుంటారు. ఈరోజు అభ్యంగన స్నానం చేసి, కొత్త బట్టలు వేసుకుంటారు. తమ ఇళ్లను శుభ్రపరిచి తోరణాలతో అలంకరించి, ఇంటి ముంగిళ్లలో బాలకృష్ణుని పాదముద్రలను వేసి గోపాలుడిని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. పగలంతా ఉపవాసం ఉండి సాయకాలం శ్రీకృష్ణుడిని పూజిస్తారు. మరునాడు ఉట్లను కొట్టి ఆనందిస్తారు.

రాష్ట్రంలోని కృష్ణుడి దేవాలయాల్లో వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఉదయం నుంచే ప్రత్యేక పూజలు,  సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు భక్తులు. ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ స్వామివారిని కొలుస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy