
ఇక ఎమ్మెల్యేలు ఉన్న గోల్డెన్ బే రిసార్ట్స్ దగ్గర పరిస్థితి టెన్షగా ఉంది. శశికళ రాత్రి నుంచి రిసార్ట్స్ లోనే ఉన్నారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో అక్కడ వందలాదిమంది పోలీసు బలగాలను మొహరించారు. మరోవైపు రిసార్ట్ కు వెళ్లేందుకు పన్నీర్ వర్గం నాయకులు పాండ్యరాజన్ ఆధ్వర్యంలో రెడీ అయ్యారు. ఇదే టైమ్ లో పన్నీర్ సెల్వంతో పాటు పాండ్యరాజన్, PH పాండ్యన్, N విశ్వనాథన్, పొన్నయ్యాన్ లను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు శశికళ ప్రకటించారు. పన్నీర్ సెల్వం వర్గం నాయకలను రిసార్ట్ కు రాకుండా అడ్డుకోవాలని DGPని రిక్వెస్ట్ చేశారు.