గోల్డ్ బాంబ్ : బంగారం అమ్మితే డబ్బులు ఇవ్వరు

goldమీ ఇంట్లో ఎమర్జెన్సీ కష్టం వచ్చింది.. చేతిలో చిల్లిగవ్వ లేదు.. అప్పు ఇచ్చేవారు కూడా దొరకలేదు.. అయితేనేం ఒంటిపై బంగారం ఉంది కదా అనే ధీమా. మీ బంగారమే కాబట్టి.. ఎలాంటి భయమూ లేకుండా అమ్మేసి డబ్బులు తీసుకొచ్చుకున్నారు. గండం గట్టెక్కారు. అప్పు చేయకుండానే గండం గట్టెక్కారు. భారతదేశంలో మధ్యతరగతి ఇంట్లో ఇలాంటి ఘటనలు సర్వసాధారణం. అలంకారంగా బంగారాన్ని ఏ విధంగా అయితే చూసుకుంటామో.. అత్యవసరానికి కూడా అదేస్థాయిలో ఆదుకుంటుందనే ధీమా గోల్డ్ పై ఉంటుంది. నోట్ల రద్దు తర్వాత.. కొత్తగా తీసుకువచ్చిన నిబంధనలు సామాన్యుడికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. బంగారం అమ్మకంపై కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బంగారం అమ్మితే డబ్బులు ఇవ్వరు. అంతా ఆన్ లైన్ ద్వారానే చెల్లిస్తారు. మీ చేతికి కేవలం రూ.10వేలు మాత్రమే ఇస్తారు. మిగతాది అంతా చెక్కు లేదా ఆన్ ద్వారానే ట్రాన్సఫర్ చేయాల్సి ఉంటుంది. మీ అకౌంట్ పడిన డబ్బును.. మీరు ఎవరికైతే ఇవ్వాల్సి ఉంటుందో వాళ్లకు ట్రాన్సఫర్ చేయొచ్చు. డబ్బే కావాలంటే మాత్రం అప్పటికప్పుడు కష్టం. నగదురహిత లావాదేవీల్లో భాగంగా గతంలో చేతికి 20వేల రూపాయలు ఇచ్చేవారు.. ఇప్పుడు ఆ పరిమితిని కేవలం 10వేల రూపాయలకు కుదించారు. మీరు లక్ష, రెండు లక్షలు, మూడు లక్షలు ఎంతకైనా మీ బంగారాన్ని నిర్భయంగా అమ్ముకోండి.. చేతికి డబ్బులు మాత్రం 10వేలే.. మిగతాది అంతా అకౌంట్ లో పడిపోతుంది. ఆ అకౌంట్ నుంచి మీ అవసరాలు తీర్చుకోవచ్చు. మొత్తానికి ఎంత ఎమర్జెన్సీ అయినా.. బంగారం కొనేవారు ఉన్నా.. డబ్బులు చేతిలో పడటానికి మాత్రం టైం పడుతుంది. ఈ మేరకు ఫైనాన్స్ బిల్లులో మార్పులు తీసుకురాబోతున్నది కేంద్రం. ఏప్రిల్ నెల నుంచే అమల్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. కొత్త నిబంధనల వల్ల బిజినెస్ పై ప్రభావం చూపిస్తుందని ఆందోళన చెందుతున్నారు వ్యాపారులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy