గోవిందా! : తిరుమలలో అద్దె గదులపై GST భారం

TTDశ్రీవారి భక్తులకు పన్ను పోటు షురూ అయ్యింది. అద్దె గదుల కేటాయింపునకు GST వర్తిస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం ఆదివారం(09-07-17) ప్రకటించింది. రూ.1000 నుంచి రూ.2వేల అద్దె గదులపై 12శాతం, రూ.2,500 నుంచి రూ.6వేల అద్దె గదులపై 18శాతం GST ఉంటుందని టీటీడీ తెలిపింది. రూ.వెయ్యి లోపు అద్దె గదులకు GST నుంచి మినహాయింపు  ఉంటుందని తెలిపింది. 

ప్రస్తుతం 1500 ఉన్న రెంట్.. GST(12శాతం)తో రూ.1,700 అయ్యింది. రూ.2వేలు ఉన్న గది అద్దె.. GST(12శాతం)తో కలిపితే రూ.2,200 అయ్యింది. ఇక రూ.2,500 ఉన్న గది అద్దె.. GST(18శాతం) కలిపితే రూ.3వేలు అయ్యింది. గరిష్ఠంగా ఉన్న రూ.6వేల అద్దె గది.. GST(18శాతం) కలుపుకుంటే ఇప్పుడు రూ.7వేల 100 చెల్లించాల్సి ఉంది. ఇవాల్టి నుంచి (జూలై 10) నుంచి సవరించిన అద్దె రేట్లు అమల్లోకి వచ్చాయి.

ttd-press-release

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy