గౌహతిలో పరుగుల వర్షం : రోహిత్ కూడా సెంచరీ చేశాడు

గౌహతి : వెస్టిండీస్ తో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇవాళ(అక్టోబర్-21) గౌహతి వేదికగా జరుగుతున్న ఫస్ట్ వన్డేలో భారత ప్లేయర్లు ఇరగదీస్తున్నారు. ఈ మ్యాచ్ లో మరో ప్లేయర్ రోహిత్ సెంచరీ చేశాడు. ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ సెంచరీ చేసి, 140 రన్స్ కు దగ్గర ఔట్ కాగా..రోహిత్ సిక్సర్లతో జోరుపెంచాడు. ఈ క్రమంలోనే తన కెరీర్ లో 20వ సెంచరీని చేశాడు. 84 బాల్స్ లో సెంచరీ బాదేశాడు.  విండీస్ నిర్దేశించిన 323 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చెలరేగి ఆడుతున్నారు. 33 ఓవర్లకు భారత్ 2 వికెట్ల నష్టానికి 256 రన్స్ చేసింది. టీమిండియా బిగ్ విక్టరీ దిశగా వెళ్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy