గ్యాస్ మీద నగదు బదిలీ బంద్

గ్యాస్ మీద నగదుబదిలీ ఎత్తివేసింది కేంద్రం. ఈనెల 10 నుంచి రాయితీ ధరకే సిలిండర్లు సరఫరా అవుతాయి. వంటగ్యాస్ కు ఆధార్ లింకు కూడా తీసేసిన సంగతి తెలిసిందే. ఏడాదికి 9 సిలిండర్లకు మించి సప్లయ్ చేయబోమని ప్రకటించిన ప్రభుత్వం ఆ సంఖ్యను 12 కి పెంచిన సంగతి కూడా గుర్తుండే ఉంటుంది. గ్యాస్ సిలిండర్ల విషయచంలో జనంలో విపరీతంగా ఆగ్రహం రావడంతో కేంద్రం ఈ చర్యలు తీసుకోక తప్పలేదు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఇదో మైనస్ పాయింట్ అవుతుందనుకన్న ప్రభుత్వం నిర్ణయాలన్నీ మార్చుకుంది. మరి ప్రజలు మన్నిస్తారా? చూడాలి!

Comments are closed.

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy