గ్యాస్ రెగ్యులేటర్ లో బంగారం

shamshabad-goldరాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో  బంగారు బిస్కెట్లు పట్టుకున్నారు కస్టమ్స్ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ కు వచ్చిన ఓ పాసింజర్ ని తనిఖీ చేయగా.. గ్యాస్ రెగ్యులేటర్ లో బంగారాన్ని గుర్తించారు కస్టమ్స్ అఫీషియల్స్.

రెగ్యులేటర్ లో350(35 తొలాలు) గ్రాముల బంగారాన్ని దాచిపెట్టాడు ఆ ప్రయాణికుడు. పట్టుకున్న బంగారం విలువ రూ.10 లక్షలు ఉంటుందన్నారు అధికారులు. దుబాయ్ నుంచి వచ్చిన ఆ ప్రయాణికున్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు పోలీసులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy