గ్యాస్ సబ్సిడీ కొనసాగుతుంది

LPG-gasపేదలు ఉపయోగించే గృహ వినియోగ LPG సిలిండర్లపై సబ్సిడీ ఎత్తివేసేది లేదని…. రాయితీ కొనసాగుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్రప్రధాన్‌ తెలిపారు. గృహ వినియోగ ఎల్‌పీజీ సిలిండర్లపై సబ్సిడీ ఎత్తివేసేది లేదని… పేదలు, సామాన్య ప్రజలు వినియోగించే గ్యాస్‌, కిరోసిన్‌ సబ్సిడీ కొనసాగుతుందన్నారు. త్రిపుర రాజధాని అగర్తలలో జరిగిన ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కార్యక్రమం కింద 20 కుటుంబాలకు గ్యాస్‌ కనెక్షన్లను అందజేశారు.

ఈశాన్య రాష్ట్రాల్లో గ్యాస్‌ కొరతను అధిగమించేందుకు బంగ్లాదేశ్‌ చిట్టగాంగ్‌ నుంచి త్రిపుర వరకు పైప్‌లైన్లు వేస్తామని తెలిపారు ధర్మేంద్రప్రధాన్‌. దీనిపై ఇప్పటికే ప్రతిపాదన ఉందని… త్వరలో ఇందుకు గాను బంగ్లాదేశ్‌ వెళ్లనున్నట్లు తెలిపారు. అలాగే పశ్చిమ బెంగాల్ ని సిలిగురి నుంచి బంగ్లాదేశ్‌ పర్వతీపూర్‌కు డీజిల్‌ సరఫరాకు పైప్‌లైన్‌ వేయనున్నట్టు తెలిపారు.

సబ్సిడీపై అందించే వంట గ్యాస్‌ సిలిండర్లపై రాయితీని తొలగిస్తామని ఇటీవల కేంద్రం లోక్‌సభలో ప్రకటించింది. నెలకు రూ.4చొప్పున సిలిండర్‌పై ధర పెంచుతూ క్రమంగా సబ్సిడీని తొలగిస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో పేదలకు కూడా రాయితీ అందకుండా పోతుందన్న ఆందోళనలు వ్యక్తమయ్యాయి. దీంతో స్పందించిన మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ గ్యాస్ సబ్సిడీపై క్లారిటీ ఇచ్చారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy