గ్రాండ్ ఎంట్రీ : మెగా హీరో సరసన సారా అలీఖాన్

58595548.cmsబాలీవుడ్‌ టాప్ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ కుమార్తె సారా అలీ ఖాన్‌ సినీ ఎంట్రీ కోసం ఎప్పట్నుంచో చర్చలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ బ్యూటీ ఎంట్రీకి రంగం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మెగాస్టార్ తనయుడు రాంచరణ్‌.. మణిరత్నం కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు ఎప్పటినుంచో గుసగుసలు వెలువడుతున్నాయి. ఈ సినిమాలో చరణ్‌కి జోడీగా ఐశ్వర్య రాయ్‌ నటించనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు చరణ్‌కి జోడీగా సారా అలీఖాన్ ను ఎంపికచేసుకోనున్నట్లు కోలీవుడ్‌ వర్గాల సమాచారం.

అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నట్లు టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం రాంచరణ్‌ సుకుమార్ దర్శకత్వంలో ‘రంగస్థలం’ చిత్రంలో నటిస్తున్నారు. చరణ్‌కి జోడీగా సమంత నటిస్తున్న ‘రంగస్థలం’ సంక్రాంతి కానుకగా ప్రేక్షకులముందుకు రానుంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy