
TCA ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ మెగా ఈవెంట్ లో.. పది జిల్లాల జట్లు పార్టిసిపేట్ చేస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో మొదటి సారి జరుగుతోన్న చాంపియన్స్ కప్ ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్నామన్నారు.. నిర్వాహకులు. రాష్ట్ర క్రికెట్ డెవలప్ మెంట్ కి ఉపయోగపడాల్సిన HCA.. అవినీతి ఆరోపణలతో కోర్టుల చుట్టూ తిరుగుతోందన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో సత్తా ఉన్న క్రీడాకారుల్ని గుర్తించి.. వారిని తీర్చిదిద్దడమే తమ లక్ష్యమంటోంది తెలంగాణ క్రికెట్ అసోసియేషన్. ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేసేందుకు అందరూ ముందుకు రావాలంటున్నారు నిర్వాహకులు.