
తెలంగాణ ప్రభుత్వం కళలకు చాలా ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు మంత్రి చందూలాల్. కార్యక్రమంలో నాటకరంగ నిపుణుడు నాగేశ్వరరావు, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ప్రొఫెసర్ సురేశ్ భరద్వాజ్, బెంగళూర్ స్కూల్ ఆఫ్ డ్రామా డైరెక్టర్ బసవ లింగయ్య, భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.
కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన నాటకాలు అందరినీ ఆకట్టుకున్నాయి. లవ్ యువర్ నేచర్ అనే థీమ్ తో చేసిన డ్రామా అందర్నీ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.. 5 రోజుల పాటు రవీంద్ర భారతిలో నాటక ప్రదర్శనలు జరగనున్నాయి.