గ్రాట్యుటీ పేమెంట్ సవరణ బిల్లుకు రాజ్యసభ ఆమోదం

raja గ్రాట్యుటీ పేమెంట్ సవరణ బిల్లుకు ఈ రోజు(మార్చి22) రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. గత గురువారం లోకసభ ఆమోదించిన ఈ సవరణ బిల్లును ఈ రోజు రాజ్యసభలో ఆమోదం పొందింది. నిరసనల మధ్యే మూజువాణి ఓటు ద్వారా బిల్లుకు ఆమోదముద్ర పడింది. రాష్ట్రపతి ఆమోదం త్వరాత ఈ  బిల్లు చట్టరూపం దాల్చనుంది.

సవరించిన ఈ బిల్లు ద్వారా ఉద్యోగులకు ప్రస్తుతమున్న పన్ను రహిత గ్రాట్యుటీ రూ. 10లక్షల నుంచి రూ. 20లక్షలకు పెరుగుతుంది. అంతేకాకుండా భవిష్యత్‌లో గ్రాట్యుటీని పెంచడానికి, మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవు సమయాన్ని  నిర్ధారించడానికి ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉండదు. ఎప్పటికప్పుడు కార్య నిర్వాహక ఉత్తర్వులు జారీ చేయడం ద్వారా వీటిని పెంచుకునే హక్కు ప్రభుత్వానికి ఉంటుంది.

 

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy