గ్రాఫిక్స్ మాయాజాలం.. ‘2.O’ టీజర్ రిలీజ్

సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ యాక్షన్ స్టార్ అక్షయ్ కుమార్ కాంబినేషన్‌లో వస్తున్న 2.0 మూవీ టీజర్ రిలీజ్ అయ్యింది. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి ఏఆర్ రెహమన్ మ్యూజిక్ డైరెక్టర్..  వినాయక చవితి సందర్భంగా రజినీ ఫ్యాన్స్ కి గిప్ట్ అందించారు శంకర్. రోబో సినిమాకు సీక్వెల్‌ గా వస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్. టీజర్‌లో స్పెషల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటున్నాయి.

ఒక్కసారిగా ఫోన్లన్నీ మాయమైపోతున్న సన్నివేశాలతో టీజర్‌ మొదలైంది. ఓ వ్యక్తి నిద్రిస్తున్నప్పుడు ఉన్నట్టుండి లేచి చూడగానే కోట్లాది ఫోన్ల మధ్యలో ఉండడం చూసుకుని భయపడతాడు. ఆ సమయంలో పై నుంచి భీకరమైన ముఖంతో అక్షయ్‌ కుమార్‌ ఎంట్రీ అదిరిపోయింది. సినిమా బడ్జెట్ లో అత్యధిక భాగం VFX  కోసమే ఖర్చు చేశారు. 75 మిలియన్ డాలర్లు.. అంటే 540కోట్లకు పైగా డబ్బు గ్రాఫిక్స్ కోసమే ఖర్చు పెట్టారు.

ఈ సినిమాలో  మంచి రోబాట్, చెడు రోబాట్ లుగా… తనదైనశైలిలో హీరోయిజం.. విలనిజం చూపించినట్టు టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను నవంబర్ 29న విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు.

 

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy