
అవును.. అతి త్వరగా అమెరికా గ్రీన్ కార్డు కావాలంటే వారు అత్యంత నైపుణ్యం ఉన్న వారిగా గుర్తింపు తెచ్చుకోవాలి. హై క్వాలిఫికేషన్ అయ్యి ఉంటే.. కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల్లోనే అర్హత సాధించొచ్చు. వీరిని ఈబీ-1 కేటగిరీ కింద పరిగణిస్తారు. ఈబీ-1 కేటగిరి అంటే ఎంప్లాయిమెంట్ బేస్డ్ ఇమ్మిగ్రేషన్. దీని కింద గుర్తింపు ఉంటే ఆరేళ్లలోనే గ్రీన్ కార్డు వస్తుంది. ఈ కేటగిరీ కింద ప్రస్తుతం 34వేల 824 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటి క్లియరెన్స్ కు ఆరేళ్ల వరకు సమయం పట్టొచ్చు. ఇక మరో కేటగిరీ ఈబీ-3. ఈ నిబంధనల కింద ఉన్నవారు గ్రీన్ కార్డు కావాలంటే కనీసం 15 సంవత్సరాల సమయం పడుతుంది. ఎందుకంటే.. ఇప్పటికే 54వేల 892 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. 2017 గ్రీన్ కార్డు జారీల సంఖ్యను ఆధారంగా నిర్ణయించి.. ఈ సమయాన్ని లెక్కించారు. గ్రీన్ కార్డు పొందిన ఐదేళ్ల తర్వాత శాశ్వత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకునే అర్హత వస్తోంది. ఈ లెక్కలు అన్నీ కూడా భారతీయులకు సంబంధించినవి మాత్రమే. ఆయా సందర్భాలు, అమెరికా డిమాండ్ ఆధారంగా గ్రీన్ కార్డు జారీలో వేగం ఉండొచ్చు కూడా…