గ్రూప్‌-2 పరీక్ష మళ్లీ నిర్వహించాలి: హైకోర్టులో మరో పిటిషన్‌

courtగ్రూప్‌-2పై హైకోర్టులో మరో పిటిషన్‌ దాఖలు అయ్యింది. పిటిషనర్‌ తరపు లాయర్‌ రచన రెడ్డి గ్రూప్‌-2 పరీక్షను మళ్లీ నిర్వహించాలని కోర్టును కోరారు. TSPSC నిర్వహించిన గ్రూప్‌-2 పరీక్షలో OMR షీట్‌లో కోడింగ్‌, డీకోడింగ్‌ విధానం లేదన్నారు.  దీంతో భారీగా అక్రమాలు జరిగాయని పిటిషనర్‌ తరపు లాయర్‌ తెలిపారు. బబ్లింగ్,రీ బబ్లింగ్ ఎంతమంది చేశారు అనేది కూడా తెలియదని… అందులో సెక్యురిటి ఫీచర్స్ ఏ మాత్రం లేవని హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. 3 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని TSPSC కి ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy