గ్రేటర్ ఎన్నికల తర్వాత బడ్జెట్ సమావేశాలు

ts secఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో బడ్జెట్ సమావేశాలు జరిపేందుకు ప్లాన్ చేస్తోంది రాష్ట్ర సర్కార్. ఓ వైపు GHMC ఎన్నికలు, మరోవైపు జిల్లా అభివృద్ధి నివేదికలు సిద్ధం కావాల్సి ఉండటంతో జనవరి లాస్ట్ వీక్ లో జరపాలనుకున్న బడ్జెట్ సెషన్స్ ఫిబ్రవరికి వాయిదా వేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక కేటాయింపులపై కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ దాదాపు బడ్జెట్ కు తుదిరూపు ఇచ్చినట్లు సమాచారం.జిల్లా నివేదికల్లో ఇప్పటివరకు జరిగిన పనులు, ఖర్చు చేసిన నిధులు, ఇంకా ఎన్ని నిధులు కావాలి, సంక్షేమ పథకాల అమలు లాంటి అంశాలపై రిపోర్ట్ ఇవ్వనున్నారు అధికారులు. ఇప్పటికే కొన్ని జిల్లాల నివేదికలు ఆర్థికశాఖకు అందినా.. మరికొన్ని జిల్లాల నివేదికలు ఇవ్వాల్సి ఉంది. సంక్షేమ పథకాలు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, నీటి పారుదలశాఖ ప్రాజెక్టులు, డబుల్ బెడ్ రూం ఇళ్లు, వ్యవసాయం లాంటి వాటికి 2016 -17 బడ్జెట్ లో ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.ఏటా ఫిబ్రవరి సెకండ్ వీక్ లో కేంద్ర బడ్జెట్ సమావేశాలు ఉంటాయి. అయితే కేంద్ర బడ్జెట్ తర్వాతే రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే పాత ఆనవాయితీకి పుల్ స్టాప్ పెట్టాలని… జనవరి 27 నుంచే బడ్జెట్ సమావేశాలు జరపాలనుకుంది సర్కార్. కానీ ఫిబ్రవరి 2వ తేదిన జిహెచ్ఎంసీ ఎన్నికలు జరగనుండటంతో సీఎం సహా నేతలంతా గ్రేటర్ పైనే కాన్సన్ ట్రేట్ చేశారు. దీంతో గ్రేటర్ ఎన్నికలు ముగిసిన వెంటనే బడ్జెట్ సమావేశాలు ప్రారంభించాలని సీఎం భావిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy