గ్రేటర్ గెలుపుపై గులాబీ నేతల కసరత్తు

ING-191015-HYD-TRSGHYDMEETINGగ్రేటర్ ఎన్నికలు ఎప్పుడొచ్చినా…GHMCపై గులాబీ జెండా ఎగురవేయాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం రంగంలోకి దిగారు మంత్రులు. తెలంగాణ భవన్ లో గ్రేటర్ నేతలతో మంత్రులు నాయిని, మహేందర్ రెడ్డి, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డితో పాటు…గ్రేటర్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు సమీక్ష నిర్వహించారు. నియోజక వర్గాల్లో నేతలంతా సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు మంత్రులు. ఎప్పటికప్పుడు వార్డుల వారిగా సమీక్షలు నిర్వహించి…గెలిచే అభ్యర్థులను గుర్తించాలని కార్యకర్తలకు సూచించారు మంత్రులు. మరోవైపు గ్రేటర్ లో బలం పెంచుకునేందుకు పార్టీలోకి వలసలను ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.నామినేటెడ్ పదవుల భర్తీ… లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై కూడా సమావేశంలో చర్చించారు మంత్రులు. పార్టీలో ఫస్ట్ నుంచి ఉన్న వారికి న్యాయం చేస్తామని గ్రేటర్ నేతలకు హామీ ఇచ్చారు. సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు…అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. గ్రేటర్ లో ఎనీ టైం నోటీఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉండటంతో… ముందస్తుగా అలర్ట్ అవుతోంది టీఆర్ఎస్. గ్రౌండ్ లెవల్ లో పార్టీని బలోపేతం చేస్తూ ఎన్నికలకు రెడీ అయ్యేలా స్కెచ్ వేసింది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy