గ్రేటర్ పై పాలక,ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం

party-logosగ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ ను 12 వ తేదీన రిలీజ్ చేయనుంది ఈసీ. 12 నుంచి ఈ నెల 17వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 2న గ్రేటర్లోని అన్ని డివిజన్లకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 5న ఎన్నికల కౌంటింగ్ నిర్వహించనున్నారు అధికారులు. ఈ నెల 8న ఎన్నికల  షెడ్యూల్ వచ్చినప్పటి నుంచే…గ్రేటర్ పరిధిలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. మరోవైపు ప్రచారంలో స్పీడ్ పెంచాయి పార్టీలు. నియోజక వర్గాలను చుట్టేస్తున్నారు నేతలు. ప్రత్యర్ధులపై మాటల దాడిని పెంచిన నేతలు…గ్రేటర్ లో టీఆర్ఎస్ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు పంచాయతీ రాజ్ మినిస్టర్ కేటీఆర్. భాగ్యనగరాన్ని మినీ భారత్ గా అభివర్ణించిన కేటీఆర్.. హైదరాబాద్ ను లవబుల్, లివబుల్ సిటీగా మారుస్తామన్నారు.గేటర్ నోటిఫికేషన్ వస్తుండటంతో  అభ్యర్ధుల ఎంపికపై కమిటీ వేసింది టీఆర్ఎస్. కేకే అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో కమిటీ వేశారు. డిప్యూటీ సీఎం కడియం, డీఎస్, ఇంద్రకరణ్ రెడ్డి, కేటీఆర్ లను సభ్యులను నియమించారు. అభ్యర్ధుల ఎంపికలో కమిటీ హైదరాబాద్ కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో సంప్రదింపులు జరుపుందన్నారు సీఎం.TRSపై కౌంటర్ ఎటాక్ కు దిగింది కాంగ్రెస్. నైతికతలేని TRS పార్టీకి సవాల్ చేసే హక్కు లేదన్నారు. GHMC ఎన్నికల్లో కాంగ్రెస్ కు సింగిల్ డిజిట్ వస్తుందని చెప్పడం….కేసీఆర్ అహంకారానికి నిదర్శనమన్నారు నేతలు. రేపు నిజాం కాలేజీ గ్రౌండ్ లో కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్న టీడీపీ-బీజేపీ..సీమాంధ్ర ఓటర్లను ఆకర్షించేందుకు స్పీషల్ ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. సీమాంధ్ర వారికి  గ్రేటర్ డిప్యూటీ మేయర్ పదవి ఇస్తామన్నారు టీడీపీ-బీజేపీ నేతలు. రేపటి కార్యకర్తల సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు అటెండ్ కానున్నారు. మరోవైపు గవర్నర్ తో పాటు..డీజీపీని కలిశారు టీడీపీ నేతలు. రాష్ట్రంలో ప్రభుత్వ పాలన…రైతుల ఆత్మహత్యలపై కంప్లైంట్ చేశారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy