
కార్నొరేటర్ గా గెలిస్తే నెక్స్ట్ ఎమ్మెల్యే కావటం ఈజీ అని భావిస్తున్నారు నేతలు. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు తన కుమార్తె విజయలక్ష్మిని కార్పొరేటర్ గా పోటీ చేయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్నీ కలిసి వస్తే మేయర్ ని చేయాలనే ఆలోచనలోనూ ఉన్నట్లు సమాచారం. డిప్యూటీ సీఎం మహమ్మద్ అలీ .. ఇప్పటికే తనతో పాటు కుమారుడిని అధికారిక కార్యక్రమాలకు తీసుకెళుతున్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా అల్లుడిని గ్రేటర్ బరిలో దింపే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. మాజీమంత్రి ముఖేష్ గౌడ్ కుమారుడు గ్రేటర్ పోటీకి సై అంటున్నారు. తమ్ముడు మధుగౌడ్ బీజేపీలో చేరటంతో కొడుకును సీన్ లో తీసుకొస్తున్నారు ముఖేశ్. కాంగ్రెస్ మాజీ MLC భిక్షపతి యాదవ్ కొడుకు పోటీకి రెడీ అవుతున్నారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ కుమార్తె కూడా.. గ్రేటర్ ఎన్నికల్లో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రజలతో సంబంధం లేకుండా డైరెక్టుగా రాజకీయాల్లో రావటం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదంటున్నారు సీనియర్లు. సమర్థత లేకపోతే సక్సెస్ కాలేరంటున్నారు.
కేసీఆర్ వారసులుగా కేటీఆర్, కవిత రాజకీయాల్లో సక్సెస్ కావటంతో మిగిలిన నేతలు కూడా తమవారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే దేవేందర్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ కుమారులు పొలిటిక్స్ లోకి వచ్చినా .. అంతగా సక్సెస్ కాలేదన్న టాక్ వినిపిస్తోంది. ముఖ్య నేతలంతా.. తమ వారసులను బరిలో దింపేందుకు ట్రైచేస్తుండటంతో.. తమ పరిస్థితి ఏమిటనే డైలమాలో ఉన్నారు అనుచరులు.