గ్రేటర్ లక్షాధికారి ఆఫర్ : ఆటోల్లో చెత్తేస్తే నజరానా

swachh_autoచెత్తకు బంపర్ ఆఫర్.. ఇదేంటి చెత్తకు బంపర్ ఆఫరేంటి అనుకుంటున్నారా.. ఇళ్లలోని చెత్తను స్వచ్ఛ ఆటోలలోనే వేసేవాళ్లకు లక్ష రూపాయలు ఇవ్వనుంది GHMC. ఎవరైతే చక్కగా.. ఆటోలలోనే చెత్త వేస్తుంటారో వారికి నెలనెలా లక్ష రూపాయలు ఇస్తుంది. చెత్తలేని నగరంగా హైదరాబాద్ ను తయారు చేసేందుకు పక్కాగా సిద్ధమైన GHMC.. ఈ  ఇళ్ళలోని చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా.. జీహెచ్ఎంసీ బళ్లలోనే వేయాలంటూ ఎన్ని సార్లు చెప్పినా.. బయట వేసేవాళ్లు వేస్తూనే ఉన్నారు. దీనిపై ఫోకస్ పెట్టిన అధికారులు.. మహిళలకు ఈ ప్రైజ్ మనీ ప్రకటించింది. ఇవ్వడమంటే ఇవ్వడం కాదు.. అందులో తడి, పొడి చెత్తను వేరు చేసి మరీ స్వచ్ఛ ఆటో కార్మికులకు ఇవ్వాలి. అలా పద్ధతి ప్రకారం చేసి.. రోజూ ఆటోలలకు ఇస్తారో.. వారికి ప్రైజ్ మనీ ఇస్తారు. దీనికి సంబంధించిన విధివిధానాలు త్వరలో ప్రకటిస్తుంది GHMC. తాము ఎన్ని రోజుల నుంచి ఇలా చెత్తను వేరు చేస్తున్నాం, ఇతర విషయాలను తెలియజేస్తూ జీహెచ్‌ఎంసీకి దరఖాస్తు చేసుకోవాలి. ఎలా దరఖాస్తు చేసుకోవాలనే వివరాలను రంజాన్‌ సెలవుల తర్వాత GHMC ప్రకటిస్తుంది. దరఖాస్తు చేసుకోడానికి మొబైల్‌ యాప్‌ను రూపొందిస్తున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy