గ్రేటర్ లో ఓటర్ల సంఖ్య ఎంతో తెలుసా

hyderabadసమగ్ర ఓటరు సర్వే తర్వాత మహానగర ఓటర్ల తుది జాబితాను ప్రకటించారు. గ్రేటర్‌లో24 అసెంబ్లీ సెగ్మెంట్లలో  మొత్తం 71 లక్షల 52 వేల 485 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు అధికారులు. ముమ్మర ఓటర్ల సమగ్ర సర్వేలో భాగంగా తొలగింపు, మారు, చేర్పుల తర్వాత సోమవారం వివరాలను విడుదల చేశారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 5.34 లక్షలు, కుత్బు ల్లాపూర్‌లో 4.23 లక్షల మంది ఓటర్లు ఉండగా.. 4.01 లక్షల ఓట్లతో ఎల్‌బీనగర్‌, 3.94 లక్షల ఓట్లతో ఉప్పల్‌ నియోజకవర్గాలు ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కోర్‌ ఏరియాతో పోలిస్తే శివారు నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. అత్యల్పంగా చార్మినార్‌లో 1.93 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. కోర్‌ ఏరియాలో అత్యధికంగా యాకత్‌పురాలో 3.20 లక్షల మంది, జూ బ్లీహిల్స్‌లో 3.11 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో పురుషులు 3.75 లక్షల మంది కాగా.. స్ర్తీలు 3.39 లక్షల మంది ఉన్నారు. 2016 తుది జాబితా ప్రకారం 82లక్షల 65 వేల 004 మంది ఓటర్లు ఉండగా.. 13.46 శాతం ఓటర్ల పేర్లు తొలగించారు.

2016 ఓటర్ల తుది జాబితా ప్రకారం గ్రేటర్‌లో 1,314 మంది థర్డ్‌ జండర్‌ ఓటర్లు ఉండగా.. ఇప్పుడా సంఖ్య 1,202కు తగ్గింది. 112 మంది పేర్లను తొలగించారు. అత్యధికంగా శేరిలింగంపల్లిలో 114 మంది, కూకట్‌పల్లిలో 85మంది థర్డ్‌ జెండర్లు ఉన్నారు. ఖైరతాబాద్‌లో 18 మంది, మలక్‌పేట, సనత్‌నగర్‌లో 31మంది థర్డ్‌ జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy