గ్రేటర్ లో గెలవకపోతే రాజీనామా చేస్తా

KTR 2జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలపై మంత్రి కేటీఆర్‌ కాంగ్రెస్ నేతలకు సవాల్‌ విసిరారు. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని  సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌, కిషన్‌రెడ్డి, టీడీపీ నేతలంతా రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌ అంటే మినీ ఇండియా అని ఆయన చెప్పారు. తెలంగాణ రాకముందు టీఆర్‌ఎస్‌పై అసత్య ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ప్రధాన ఆర్థిక వనరు హైదరాబాద్ అని ఆయన చెప్పారు. 18నెలల కాలంలో హైదరాబాద్‌ను ఆర్థికంగా  అభివృద్ధి చేశామన్నారు కేటీఆర్. హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కనీస సౌకర్యాలు కల్పించడంలో గత పాలకులు విఫలమయ్యారని మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం కీలకమైందన్నారు. గ్రేటర్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌దే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గ్రేటర్‌లో 100 సీట్లు కచ్చితంగా గెలుస్తామని ఆయన చెప్పుకొచ్చారు. నాలుగైదు రోజుల్లో మేనిఫెస్టో విడుదల చేస్తామని.. రెండోస్థానంలో మజ్లిస్‌ పార్టీ ఉంటుందన్నారు. కాంగ్రెస్‌కు సింగిల్‌ డిపాజిట్‌ కూడా రాదని కేటీఆర్ జోస్యం చెప్పారు.

మోస్ట్ గ్లామరస్ లీడర్ కేసీఆర్ అన్న కేటీర్… తమకు సినిమా హీరోలు అవసరం లేదని చెప్పారు. రామమందిరం కడతామన్న బీజేపీ రాముడికే శఠగోపం పెట్టిందని తీవ్ర స్థాయిలో కమలనాథులను విమర్శించారు. తనకు సీఎం పదవిపై ఆశలేదన్నారు. 15 ఏళ్ల తర్వాత కూడా కేసీఆరే పార్టీకి అధ్యక్షుడిగా, సీఎంగా ఉంటారని ధీమా వ్యక్తం చేశారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy