గ్రేటర్ వార్డుల విభజనను అడ్డుకుంటుందెవరు..?

imgగ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు.. పార్టీలు, నాయకుల్లో టెన్షన్ పెంచుతున్నాయి. త్వరలో ఎన్నికలు జరగడం ఖాయమన్న సిగ్నల్స్ వస్తున్నా… ఇప్పటికీ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. అయితే.. ఈ ఆలస్యం వెనక.. ప్రభుత్వ వ్యూహం ఉందన్న వాదన వినిపిస్తోంది.

నేతల్లో టెన్షన్

త్వరలో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు.. పార్టీలు, నాయకుల ఓపికకు పరీక్ష పెడుతున్నాయి. ఇప్పటివరకూ వార్డుల రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి ప్రకటన రాకపోవడం… ఎప్పుడు వస్తుందన్న విషయంపై క్లారిటీ లేకపోవడంతో.. నాయకులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. మరోవైపు.. అధికార పార్టీలో చేరికలు కూడా.. ప్రత్యర్థి పార్టీల్లో టెన్షన్ పెంచుతున్నాయి.

గులాబీ దళం పరుగు

150 డివిజన్లలో.. 100 డివిజన్లపై ప్రత్యేక దృష్టి పెట్టిన టీఆర్ఎస్.. కనీసం 60కిపైగా డివిజన్లు సొంతం చేసుకోవాలనే ప్లాన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి చాలా ప్రాంతాల్లో.. బలమైన నేతలపై గురి పెట్టిన అధికార పార్టీ… బంగారు తెలంగాణ కోసం తమతో కలిసి రావాలంటూ పిలుపునిస్తోంది. అధికార పార్టీలో ఉంటే ఫ్యూచర్ కూడా బాగుంటుందని లెక్కలేస్తున్న విపక్షాల సీనియర్లు.. గులాబీ కండువాలు కప్పుకునేందుకూ పోటీ పడుతున్న విషయం రోజూ రిపీట్ అవుతోంది. ఈ ఎఫెక్ట్ తో… టీఆర్ఎస్ ఫస్ట్ టార్గెట్ రీచ్ అయినట్టే కనిపిస్తోంది.

జంపింగ్స్ తోనే ఆలస్యమా?

ప్రస్తుతానికి వలసలు, చేరికల హంగామా నడుస్తుండడంతో… రిజర్వేషన్ల ఖరారు పెండింగ్ లో పడిందన్న ప్రచారం నడుస్తోంది. మరోవైపు పార్టీ బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో చేరికలు ఓ కొలిక్కి వచ్చి.. గెలుపు ఖాయమన్న కాన్ఫిడెన్స్ వచ్చాకే.. ప్రభుత్వం గ్రేటర్ లో వార్డుల రిజర్వేషన్లు ప్రకటిస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే కారణంతో.. సిటీలో మంత్రులు రోజూ చేరికల కార్యక్రమాల్లో బిజీగా ఉంటున్నారంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

బలం పెంచుకోవాలి

రిజర్వేషన్ల ఖరారుకు, గ్రేటర్ ఎన్నికల నోటిఫికేషన్ కు మధ్య గ్యాప్ ఉండొద్దన్నది అధికార పార్టీ ఆలోచనగా తెలుస్తోంది. గ్యాప్ ఎక్కువగా ఉంటే.. ప్రతిపక్షాలు కోర్టుకు వెళ్లే చాన్స్ ఉందని  పార్టీ అభిప్రాయంగా వినిపిస్తోంది. అందుకే.. ముందు  చేరికలతో పార్టీ బలం పెంచుకుని… ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేసి.. చివరికి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చేలా జాగ్రత్త పడడమే సర్కార్ ప్లాన్ గా ప్రచారం జరుగుతోంది.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy