గ్లోబల్ వైరల్ : బాటిల్ వాటర్ తాగిన నాగుపాము

dcపామును చూస్తే చాలు ఆమ‌డ దూరం ప‌రిగెడుతాం. అదే నాగుపామే ప్ర‌త్య‌క్ష‌మైతే ఇక ఆ ప‌రిస‌రాల్లోనే జ‌నం క‌నిపించ‌రు. అంత‌లా ఈ విష‌పూరిత పాముల‌కు భ‌య‌ప‌డ‌తారు. కానీ క‌ర్నాట‌క రాష్ట్రంలోని కైగా ప‌ట్ట‌ణంలో మాత్రం ఓ పేద్ద నాగుపాము నీళ్లు తాగింది. నీళ్లు తాగ‌టంలో వింతేముంది అంటారా..? వాటర్ బాటిల్‌తో ఒక వ్య‌క్తి నీళ్లు ప‌డుతుంటే ఎంచ‌క్కా ప‌డ‌గ విప్పి నోటితో తాగింది. సామాన్యంగా జ‌న‌సంచారంలోకి వ‌చ్చేందుకు భ‌య‌ప‌డే పాములు… చుట్టుప‌క్క‌ల జ‌నం గుమికూడి ఉన్నాకూడా ఈ పాము ముందు దాహం తీర్చుకునేందుకే ప్రాధాన్య‌త ఇచ్చింది.

కైగా ప‌ట్ట‌ణంలో క‌రువు తాండ‌వం చేస్తోంది. తాగేందుకు మంచి నీటి దొర‌క్కా ప్ర‌జ‌లు ఎలా అయితే ఇబ్బందులు ప‌డుతున్నారో అక్క‌డి జంతువులు కూడా నీరులేక అల్లాడి పోతున్నాయి. ఈ క్ర‌మంలోనే ఈ 12 అడుగులు పాము నీటికోసం త‌చ్చాడుతుండ‌గా  అక్క‌డి స్థానికుడు ఒక వాట‌ర్ బాటిల్‌తో నీళ్లు అందించాడు. అయితే పాము సంగ‌తి తెలిసిన ఆ వ్య‌క్తి.. నీళ్లు ప‌ట్టే స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాడు. విషయాన్ని అధికారులకు సమాచారం ఇచ్చారు. వాళ్లు వచ్చి.. ఆ పామును అధికారులు ప‌ట్టుకుని జంతుసంరక్ష‌ణ శాల‌కు త‌ర‌లించారు. అక్కడ కూడా మళ్లీ నీళ్లు తాగించారు. పాము నీళ్లు తాగుతూ గుటకలు వేయటం వీడియో స్పష్టంగా కనిపించింది. ఆ వీడియో నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది.

Leave a Reply

Connect with us© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy