
గుజరాత్ లయన్స్ తరపున ఓపెనర్ డ్వేన్ స్మిత్ చెలరేగిపోయాడు.39 బంతుల్లో 74 పరుగులు చేసి మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ రైనా బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. 25 బంతుల్లో 39 పరుగులు చేశాడు. రైనాకు చక్కని సహకారం అందించాడు దినేష్ కార్తీక్. 23 బంతుల్లో 35 పరుగులు చేసి గుజరాత్‌ను విజయతీరాలకు చేర్చాడు. చివర్లో వికెట్లు పడినప్పటికీ ఏమాత్రం ఆందోళన చెందకుండా గుజరాత్ బ్యాట్స్‌మెన్ లక్ష్యాన్ని చేధించారు. ఈ మ్యాచ్ లో ఓడిపోవడంతో పంజాబ్ ప్లే ఆఫ్ అవకాశాలు టైట్‌గా మారాయి.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది గుజరాత్ లయన్స్. ఓపెనర్ గప్టిల్ థంపి బౌలింగ్‌లో 5 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన షాన్మార్ష్తో కలిసి ఆమ్లా ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు. కేవలం 60 బంతుల్లో 104 పరుగులు చేసి జట్టు స్కోరులో కీలక పాత్ర పోషించాడు. 5 సిక్స్‌లు, 8 ఫోర్లతో ఆమ్లా అలరించాడు. ఆమ్లాకు సీజన్ లో ఇది రెండో సెంచరీ కావడం విశేషం. సీజన్ లో తొలి సెంచరీని ఆమ్లా ముంబై పై చేశాడు. మరో వైపు షాన్ మార్ష్ కూడా రెచ్చిపోయాడు. 43 బంతుల్లో 58 పరుగులు చేశాడు. ఇందులో 8 ఫోర్లున్నాయి. జట్టు స్కోరు 127 పరుగుల వద్ద షాన్ మార్ష్ కులకర్ణి ఔట్ చేశాడు. ఇన్నింగ్స్ చివరి ఓవర్లో ఆమ్లా థంపి బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔట్ అవడంతో పంజాబ్ 3 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది.