ఘనంగా అటుకుల బతుకమ్మ సంబురం

celeberating-bathukamma-at-warangalఉయ్యాల పాటలు… గౌరమ్మ పూజలు. కోలాటాలు…లయబద్దంగా ఆటలు. రెండోరోజు అటుకుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆడపడుచుల ఆటపాటలతో వేడుకలు అంబరాన్నంటాయి. కరీంనగర్ జిల్లాలో జాగృతి ఆధ్వర్యంలో జరిగిన సంబరాల్లో మహిళలు పాల్గొన్నారు. అటుకుల బతుకమ్మ సంబరం అంబరాన్నంటింది. తీరొక్క పూలతో పేర్చిన బతుకుమ్మలతో సందడి చేశారు ఆడపడుచులు. ఊరు వాడ, పల్లె పట్నం తేడా లేకుండా జరుగుతున్న వేడుకల్లో చిన్నా…. పెద్దా పాల్గొన్నారు.  జాగృతి ఆధ్వర్యంలో రెండోరోజు కరీంనగర్లో అటుకుల బతుకమ్మ సంబరాలు జరిగాయి. హుస్నాబాద్ RTC డిపో గ్రౌండ్ లో బతుకమ్మ ఆడారు ఎంపీ కవిత. ఉదయం నుంచే స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మను పేర్చారు. స్వరాష్ట్రంలో ఆడపడుచులంతా వేడుకలను ఘనంగా చేసుకోవాలన్నారు కవిత. ఇక అసెంబ్లీ ఆవరణలోనూ బతుకమ్మ వేడుకలు అందిరినీ ఆకట్టుకున్నాయి. శాసన మండలి, సచివాలయ మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడారు. మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ మహిళలతో కలిసి దాండియా ఆడారు. బతుకమ్మ పాటలకు లయబద్దంగా కాలు కదిపారు.

మరోవైపు హైదరాబాద్ అంబర్ పేటలో బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. కేంద్రమంత్రి హన్స్ రాజ్, బీజేపీ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, ఇతర నేతలు అటెండయ్యారు. బతుకమ్మలు ఎత్తుకొని సందడి చేశారు. అన్ని వర్గాల ప్రజలు ఆనందంగా బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నారు.

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy