ఘనంగా ఆదివాసీల శివరాత్రి సంబురం

shiva_shivaratri-chenchusనల్లమల అడవులు శివనామస్మరణతో మార్మోగాయి. ఓంకార నాదంతో ప్రతిధ్వనించాయి. పట్టణానికి దూరంగా దట్టమైన అటవీ ప్రాంతంలో నివశించే చెంచులు .. మహాశివరాత్రిని ఘనంగా జరుపుకున్నారు. ప్రకృతినే పరమశివుడుగా పూజించే ఆదివాసీల శివరాత్రి సంబురం..  పూజలు, కోరికలు అన్నీ ప్రత్యేకమే.

నాగర్ కర్నూల్ జిల్లా భౌరపూర్ లో చెంచుల జాతర వైభవంగా జరిగింది. అడవిలోని ఈ గుడిసెనే శివాలయం.. లోపల శివయ్య, గౌరమ్మ, నాగపడిగే, ఆంజనేయ విగ్రహాలు ఉన్నాయి. పక్కనే భ్రమరాంభిక ఆలయం కూడా ఉంది. ముందుగా గోవులకు పూజ చేసి.. ఓం నందీశ్వర అంటూ శివయ్యను దర్శనం చేసుకున్నారు భక్తులు. ఏ జంతువూ తమకు అడ్డు రావొద్దని స్వామివారిని పూజలు చేశారు. గడ్డలు, పండ్లు, తేనెలు, పువ్వులు బాగా దొరకాలని మొక్కుకున్నారు. ఇండ్లు వద్దు… జీవితాలు కాపాడితే చాలంటూ వేడుకున్నారు. లింగమయ్య దర్శనం కోసం చంటిపిల్లతో పాటు తరలివచ్చారు చెంచులు.

అడవిలో జరిగిన  శివరాత్రి జాతరకు ఏపీలోని గుంటూరు, కృష్ణా, రాష్ట్రంలోని నల్లగొండ, నాగర్ కర్నూలు, వికారాబాద్  జిల్లాలలోని 113 పెంటల నుంచి చెంచులు తరలివచ్చారు. శివరాత్రి వేడుకలో భాగంగా  డప్పు చప్పుళ్ల మధ్య దేవుడిని ఊరేగించారు. సంప్రదాయ ఆటాపాటలతో సందడి చేశారు చెంచులు.

కన్నులపండుగా జరిగిన మల్లన్న కళ్యాణంలో కుటుంబ సభ్యులతో పాటు  పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు చెంచులు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy