ఘనంగా చిల్డ్రన్స్ డే వేడుకలు

childరాష్ట్రంలో నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంగళవారం నవంబర్ (14)న చిల్డ్రన్స్ డే లో భాగంగా..అన్ని జిల్లాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు స్కూళ్ల నిర్వహాకులు. బాలల హక్కుల పరిరక్షణపై అవగాహన ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీల్లో స్వతంత్ర్య సమరయోధులు, రాజకీయ నేతల వేశాల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు. నల్గొండలో చిల్డ్రన్స్ డే గ్రాండ్ గా జరిగింది. భారతదేశ వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల పాత్రల్లో చిన్నారులు ఆకట్టుకున్నారు. జిల్లాలోని వివిధ స్కూళ్లల్లో చిల్డ్రన్స్ డే వేడుకలను సంబరంగా నిర్వహించారు. వేడుకల్లో చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

బాలల హక్కులను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు… వరంగల్ లీగల్ సెల్ అథారిటీ న్యాయమూర్తి అనిరోజ్ క్రిస్టియాన్. బాలల దినోత్సవం సందర్భంగా వరంగల్ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో.. వాక్దాన్ నిర్వహించారు. పోలీస్ కమిషనరేట్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. ఆడపిల్లలపై వివక్ష చూపించొద్దంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్ లో చైల్డ్ లైన్ కాల్ సెంటర్ ను ప్రారంభించారు సీడబ్యూసీ చైర్మెన్ ప్రసాద్. తల్లిదండ్రులు తమ పిల్లలను పనులకు పంపించి వారి భవిష్యత్తును నాశనం చేయొద్దన్నారు. ఆపదలో ఉన్న పిల్లల కోసం ఈ టోల్ ఫ్రీ సెంటర్ ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో మేయర్ గుండాల కృష్ణ, ఐసీడీఎస్ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు.

అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనూ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి.  సింగరేణి ఆధ్వర్యంలో  కొత్తగూడెం సింగరేణి హైస్కూల్ లో ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. వేడుకల్లో చిన్నారులకు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు.

సిద్దిపేటలో మాతాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చిల్డ్రన్స్ డే వేడుకలు జరిగాయి. పిల్లల హక్కులపై అవగాహన కల్పిస్తూ…పట్టణంలో ర్యాలీ నిర్వహించారు విద్యార్థులు. తర్వాత ఓ ఫంక్షన్ హాల్ లో జరిగిన సంబురాల్లో మహిళా శిశు సంక్షేమశాఖ రూపొందించిన సురక్షిత గ్రామజ్యోతి పుస్తకం ఆవిష్కరించారు అతిధులు. చివర్లో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన ఆకట్టుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో నెహ్రూ జయంతి వేడుకలు జరిగాయి. న్యూ లిటిల్ హార్ట్స్ స్కూల్ ల్లో జరిగిన వేడుకల్లో స్వాతంత్ర్య సమర యోధుల వేషాల్లో  చిన్నారులు ఆకట్టుకున్నారు. పట్టణంలో నిర్వహించిన ర్యాలీలో ఏకపాత్రాభినయం, కోలాటం విన్యాసాలు ప్రదర్శించారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy