ఘనంగా శ్రీవారి వసంతోత్సవాలు

TTDతిరుమల వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతీ ఏడాది వసంత రుతువు క్షేత్రమాసంలో శ్రీవారికి ఈ ఉత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శ్రీదేవి-భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు బంగారు తిరుచ్చిలో వూరేగారు. వేదపండితులు స్వామివారికి ఆరాధనలు, అభిషేకాలతో పాటు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ ఉత్సవాలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. ఆదివారం ఉదయం స్వామివారికి స్వర్ణ రథోత్సవం నిర్వహిస్తారు. వసంతోత్సవాల సందర్భంగా శ్రీవారికి శుప్రభాతం మినహా ఆర్జిత సేవలను రద్దు చేసింది టీటీడీ.

Leave a Reply

© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy