ఘనంగా హనుమాన్ జయంతి: ఆలయాల్లో కిక్కిరిసిన భక్తులు

hanuman-jayantiహనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని  ఆలయాలు అందంగా ముస్తాబయ్యియి.కొన్ని ఆలయాల్లో నిన్నటి  నుంచే ఉత్సవాలు ప్రారంభం కాగా మరికొన్ని ఆలయాల్లో ఇవాళ(గురువారం,మే-10) ఒకరోజు మాత్రమే హనుమాన్ జయంతి ఉత్సవాలు జరగనున్నాయి. మరోవైపు కొండగట్టు.. వేములవాడ రాజన్న ఆలయాలు హనుమాన్ మాలధారులతో కాషాయమయంగా మారాయి.

ఏడాదిలో  రెండు సార్లు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు. ఒకటి హనుమాన్ విజయానికి ప్రతీకగా… మరొకటి పెద్ద హనుమాన్ జయంతిగా చేసుకుంటారు. ఇవాళ(గురువారం) పెద్ద హనుమాన్ జయంతి కావడంతో హైద్రాబాద్ లోని తాడ్ బండ్ హనుమాన్ ఆలయం, సనత్ నగర్ బడా హనుమాన్ ఆలయాలను అందంగా ముస్తాబు చేశారు. ప్రతీ ఏడాది రెండు హనుమాన్ జయతి ఉత్సవాలు నగరంలో ఘనంగా జరుపుతామంటున్నారు ఆలయ పూజారులు. ఉదయం అభిషేకాలతో పూజలు ప్రారంభమై, రాత్రి హనుమాన్ చాలీసాతో ఉత్సవాలు ముగుస్తాయంటున్నారు.

జగిత్యాల జిల్లా కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. హనుమాన్ మాలధారులతో పాటు సామాన్య భక్తులు పెద్ద ఎత్తున కొండగట్టుకు తరలివస్తున్నారు. 41 రోజులు దీక్షలు చేసిన భక్తులు కొండకు వచ్చి మాలలు తీయనున్నారు. ఎండాకాలం కావడంతో భక్తుల కోసం ఆలయ అధకారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యం కల్పించారు. హనుమాన్ జయంతి వేడుకలకు 2 లక్షల మందికి పైగా వస్తారని అంచనా వేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సులు కొండగట్టుకు నడుతుపుతున్నారు.

వేములవాడ రాజన్న ఆలయం హనుమాన్ భక్తులతో కాశయమయమైంది. హనుమాన్ దీక్ష చేపట్టిన స్వాములు హనుమాన్ జయంతి సందర్భంగా మాల విరమణ కొండగట్టు, లేదా అగ్రహారం అంజనేయ స్వామి ఆలయంలో చేయనున్నారు. దీక్షా విరమణ ముందు వేములవాడ రాజన్నను దర్శించుకొవడం అనవాయితీ కావడంతో… వేలాది మంది హనుమాన్ దీక్షా పరులు రాజన్నను దర్శించుకుంటున్నారు.

Leave a Reply

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy