ఘనంగా NTR 20వ వర్థంతి వేడుకలు

NTRమాజీ సీఎం,దివంగత నటుడు ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. తెలుగువారి కీర్తిని పెంచిన నేతకు ఘనంగా నివాళులు అర్పించారు పార్టీ నేతలు,కుటుంబ సభ్యులు. లోకేశ్,  బ్రహ్మణితో కలిసి ఎన్టీఆర్ ఘాట్ లో నివాళులు అర్పించారు ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరి. తన తండ్రి ఆశయ సాధన కోసం కృషి చేస్తామన్నారు. అంతకుముందు ఎన్టీఆర్ సమాధి దగ్గర పూలమాల వేసి నివాళులు అర్పించారు మనువలు కళ్యాన్ రామ్, జూనియర్ ఎన్టీఆర్. సినీ నటుడిగా.. రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజల ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన మహానుభావుడు ఎన్టీఆర్ అని అన్నారు ఎమ్మెల్యే బాలకృష్ణ. తనకు తండ్రి, గురువు ఎన్టీఆరే అన్నారు. ఇక రాజకీయంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన వ్యక్తి ఎన్టీఆర్ అన్నారు టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు. ఎన్టీఆర్ ఘాట్ దగ్గర పూల మాల వేసి నివాళులు అర్పించారు. తెలుగు జాతికి ఎన్టీఆర్ చేసిన సేవలు మరలేనివన్నారు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి. పేద ప్రజల సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టిన ఘనత ఎన్టీఆర్ కే దక్కుతుందన్నారు. మరోవైపు జిల్లాలోనూ ఎన్టీఆర్ వర్థంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుజాతి సంక్షేమం కోసం కృషి చేసిన నాయకుడికి ఘనంగా నివాళులు అర్పించిన నేతలు… ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు.

 

Comments are closed.

Connect with us



© 2012 - 2016 VIL Media Pvt Ltd. All rights reserved,
Contents of v6news.tv are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof,
without consent of VIL Media is illegal.Such persons will be prosecuted.  Terms & Conditions  |  Privacy policy